సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
మహాభారతం- వనవాసం ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మహాభారతం అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారతంలో వనవాసం పాండవుల జీవితంలో ఒక కీలక ఘట్టమని అన్నారు. ఆ సమయంలో పాండవులు రుషుల నుంచి జ్ఞానాన్ని పొందారు. నారదుడు, ద్విమానుడు వంటి రుషులు వారికి అనేక కథలు, సూక్తులను చెప్పారని తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి