అలరించిన లఘు నాటికలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికగా ఆదివారం గుంటూరు హ్యూమర్ క్లబ్ వారి 12వ వార్షిక వేడు కలు ఘనంగా జరిగాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు మధువని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా థియేటర్ ట్రైనర్, ప్రాక్టీషనర్, డైరెక్టర్ సీహెచ్. అమృతవర్షిణి, వ్యవస్థాపక కార్యదర్శి షేక్ లాల్ వజీర్, కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. తదుపరి జరిగిన లఘునాటికలు ఓర్నీ, పోవోయి అనుకోని అతిథి నాటికలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి