అలరించిన జానపద పాటలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత, సం స్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ సౌజ న్యంతో శ్రీటీ.వీ, కళాంజలి క్రియేషన్స్ సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేయగా, సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించారు. రంగం రాజేష్ బృందం(విజయవాడ) ఆంధ్ర రాష్ట్ర ప్రగతి జానపద, ఆట పాట నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, కళారత్న డాక్టర్ ఓవీ రమణ, ఎన్టీఆర్ కళాపరిషత్ కార్య దర్శి కాట్రగడ్డ రామకృష్ణ పాల్గొనగా, కళాకా రులను సత్కరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి