కళలను, కళాకారులను ప్రోత్సహించటమే ప్రభుత్వ లక్ష్యం
కళలను, కళాకారులను ప్రోత్సహించటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనే యులు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై శ్రీ టీ.వీ, కళాంజలి క్రియేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర నాటకోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కళాకారులకు కొదవ లేదని, వారికి సరైన వేదికల లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలోనే కళా పోషకులకు అని సౌకర్యాలతో కూడిన వేదికలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన కవిరాజు విజయం పద్యరూపక టెలీఫిలిమ్ ప్రదర్శన కళాభిమానులను అలరించింది. తొలుత దూరదర్శన్ ప్రోగ్రాం డైరెక్టర్ ఏవీ కృష్ణ మోహన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, కవిరాజు సాహితీ సమి తి అధ్యక్షుడు ఆలోకం పెద్దబ్బయ్య ప్రారంభించారు. ఆలోకం పెద్దబ్బ య్యకు జీవీ ఆంజనేయులు జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి