ఆకట్టుకున్న ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ, గుంటూరు వారి సౌజన్యంతో శ్రీ షిరిడిసాయి తోలుబొమ్మలాట బృందం, నరసరావుపేట వారిచే తెలుగువారి ప్రాచీన కళారూపం ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. దుర్గారావు, సత్యనారాయణ, కుమారి, కోటేశ్వరి, చిన్న, బ్రహ్మం, వెంకట దాసు, గణేష్, కార్తికేయ, కమల్ బృందం పాండవుల అజ్ఞాతవాసం, బృహన్నల నాట్యగురుత్వం, కౌరవుల కుట్ర, ఉత్తరకుమారుని ప్రజ్ఞలు, ఉత్తర గోగ్రహణము చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం ఘట్టాలను పద్యాలు, గేయాలు, వచనంతో అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొన్నారు. గుళ్ళపల్లి రాఘవరావు కళాకారులను ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
.jpeg)







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి