పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవం, మల్లాది చంద్ర శేఖరశాస్త్రి శత జయంతి నిర్వహించారు. భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్), శ్రీరామకృష్ణా నాట్య మండలి సంయుక్తంగా నిర్వ హించగా, డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అధ్యక్షత వహించారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారంతో సత్కరిం చారు. కార్యక్రమంలో సినీ నటులు మల్లాది రాఘవ రావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తా నయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డాక్టర్ చింతలపాటి శూలపాణి, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. సభానంతరం ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రేక్షకులను అలరించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి