కళారత్న పురస్కార గ్రహీతలకు సత్కారం
బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై మంగళవారం జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్, గెట్ టు గెదర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న (హంస) అవార్డు అందుకున్న ప్రముఖులకు సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతులు సీహెచ్. మస్తానయ్య, నాట్యాచార్య డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యంను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రమణ్యం, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు, కోగంటి బసవనందికేశ్వరరావు పాల్గొని ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి