మాతాపితల సేవలో దాగివున్న మాధవ సేవ
తల్లిదండ్రుల సేవలో ఉందని మాధవసేవ వారిని ఉన్నతులుగా భావించి భక్తి శ్రద్ధలతో సేవించాలని సుందర చైతన్యానంద స్వామి శిష్యులు, ఆధ్యాత్మిక ప్రవచకులు కె.వి కోటేశ్వరావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంక టేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ఆదిశంకరాచార్యుల విరజిత మాతృ పంచకం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవీ కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ జీవితంలో తల్లికి మించింది ఏదీ లేదన్నారు. పుడమి తల్లికంటే జన్మనిచ్చిన తల్లేగొప్పది అన్నారు. వర్షించేనింగికన్నావాత్సల్యాన్ని కురిపించే తండ్రి గొప్ప వాడన్నారు. తన ఆయుష్షును కూడా పోసుకుని సంతోషంగా బతకమనేది తల్లి అందుకే మన వేదాలలో తల్లికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందో తెలుపుతూ, ఆతల్లిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకోవాలన్నారు. ఇందుకు నిదర్శనం శ్రీ ఆదిశంకరుల వారి చరిత్రే అన్నారు. శ్రీ రాముడు మాతాపితల పట్ల యెంత భక్తి కలిగి ఉన్నాడనేది రామాయణం తెలియజే స్తుందన్నారు.కార్యక్రమంలో సుందర సత్సంగ్ సభ్యులు మన్నవ రవిప్రసాద్, పీ.శివారెడ్డి, చెన్నకేశవరావు, ఏకాంబరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి