బహుముఖ ప్రజ్ఞాశాలి మస్తానయ్య
బహుముఖ ప్రజ్ఞాశాలి సీహెచ్. మస్తానయ్య అని పలువురు ప్రముఖులు ప్రశంసిం చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్న సందర్భంగా బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యను కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సత్కరించారు. సాహితీవేత్త ధనకుధరం సీతారామానుజాచార్యులు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలి తాంబ దంపతులు, ఆలయ కమిటీ పాలకమండలి, నగర ప్రముఖులు, పలు కళా, ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో సత్కరించారు. ఈసందర్భంగా సీతారామానుజా చార్యులు మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం, ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఉపాధ్యక్షుడిగా, 2010 నుంచి అధ్యక్షుడిగా ఉండి ఆర్థిక వ్యవహారాలతో పాటు, సాంస్కృ తిక కార్యక్రమాల నిర్వహణలో ప్రముఖపాత్ర వహించారన్నారు. ప్రస్తుతం దేవాలయ సేవలో తరిస్తు న్నారన్నారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ కోశాధికారిగా ఉండి మహాభారత వైజయంతి, రామాయణ వైజయంతి, యజ్ఞయాగాలు తదితర కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తున్న బహుమఖ ప్రజ్ఞాశాలి మస్తానయ్య అని ప్రశంసించారు. ముందుగా చిమట రాఘవరావు సుందరకాండ ప్రవచనం జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి