అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్‌కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి