అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
నిరంతరం సంగీత కళాకారులను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ సంగీతాన్ని భావితరాలకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. బృందావన్గా ర్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్న మయ్య కళావేదికపై శనివారం సాయంత్రం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శ్రీభక్త జ్ఞానానందతీర్థ (ఓగిరాల వీర రాఘవశర్మ) ఆరాధన సంగీత ఉత్సవం నిర్వహించారు. డాక్టర్ లలిత ప్రకాష్చంద్ర, ఆలయ పాలక మండలి నిర్వా హకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. విద్వాన్ వినయ్ చేపట్టిన శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. వయోలిన్పై గాయత్రీ విభావరి (చెన్నై), మృదంగంపై బీరక సురేష్బాబు వాయి దాన్ని అందించారు. అనంతరం విద్వాన్ ఎస్.ఆర్. వినయ్ (బెంగళూరు)కి శ్రీభక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో ఓగిరాల రామకృష్ణ, సంస్థ ప్రధాన కార్య దర్శి ఏం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.రా జరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను, అతిథులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి