అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఆకట్టుకున్న సాహిత్య సభ
బృందావన్ గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై సీనియర్ సిటిజన్స్
వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ ఆదివారం నిర్వహించారు.
తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు విజయబాబు, విద్యావేత్త నూతలపాటి
తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ భక్తి, వైదేహి నరసింహ జయంతి భక్త
రక్షణకు భగవం తుడు అవతరించిన విధానాన్ని వివరించారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఆరెటి
కృష్ణకుమారి తల్లి శిక్షణలో పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి నిర్వ హించారు.
కార్యక్రమంలో డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, సామ్రాజ్యం, షేక్ కాసింబి తదితరులు పాల్గొ న్నారు. కుమారి జాహ్నవి
బృందం భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి