భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
అలరించిన కీర్తనల గానం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గరి మెళ్ల బాలకృష్ణప్రసాద్ స్మృత్యంజలి కీర్తనల గానం శనివారం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చింతలపాటి రమాగోపాలకృష్ణ, పావని, నాగలక్ష్మి అన్నమాచార్య విరచిత కీర్తనల గానం చేశారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి