స్ఫూర్తిప్రదాత రాణాప్రతాప్ సింగ్
రాణాప్రతాప్ సింగ్ స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం ఆధ్వర్యంలో రాణాప్రతాప్ సింగ్ జయంతిని శుక్రవారం రాత్రి నిర్వహించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈసందర్భంగా పత్రి గాయత్రీదేవి భక్తి సంకీర్తన చేశారు. సభాధ్యక్షుడిగా రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ రామరాజు శ్రీనివాస్, భాజపా రాష్ట్ర అధి కార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ, నూతలపాటి తిరుపతయ్య, డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి, షిండే లక్ష్మీనారాయణ, సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీధర్ బాబు తదితరులు ప్రసంగించారు. ఇదే వేదికపై డాక్టర్ రాజపుత్ర మాధు రీవిజేతసింగ్, బాణాల వెంకట సాయిమణికంఠ, రాజపుత్ర కార్తికలకు ప్రతిభా పురస్కారాలిచ్చి నిర్వాహకులు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్షత్రి ధర్మనారాయణసింగ్, ఛత్రపతి శివాజీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి జాజం సుబ్రహ్మణ్యం, బాణాల ఆంజ నేయులు కార్యక్రమాలను నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి