పాదుకా పట్టాభిషేకముపై ఆధ్యాత్మిక ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య
కళావేదికపై బుధవారం పాదుకా పట్టాభిషేకముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆల
య కమిటీ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించారు. సాహితీవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ అయోధ్యాకాండలో అనేక
ధర్మసూక్ష్యాలు మనకు తెలియవస్తాయన్నారు. దశరధ మహారాజు ప్రజలలో అన్ని వర్గాల వారిని
పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి, ఆ సభలో శ్రీరాముడిని రాజుని చేద్దామని దీనిపై మీ మీ అభిప్రాయాలు చెప్పమన్నారు.
దీనిని బట్టి ఆ రోజులల్లో ప్రజాస్వామ్యము ఎంత చక్కగా పరిఢవిల్లినదో మనకు
అర్ధమవుతుందన్నారు. తండ్రిని సత్యము నందు నిలబెట్టుటకై శ్రీరాముడు అరణ్యములకు బయలు
దేరుతాడనీ, తెల్లవారితే
పట్టాభిషేకం అన్నపుడు, రెండు సందర్భాలలో
కూడా శ్రీరాముడు ఒకే విధంగా ఉన్నాడని, ఇది దైర్యవంతుడి లక్షణమన్నారు. నేటి యువత శ్రీరాముడు చూపించిన ఈ లక్షణాలు
తప్పక కలిగి ఉండాలన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి