దార్శనికుడు డాక్టర్ కొండబోలు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం
ప్రముఖ వైద్యుడిగా ఆరు దశాబ్దాలకు పైగా, విద్యాప్రదాతగా డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య నిలిచారని డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణయ్య అన్నారు. బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై మంగళవారం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ కొండబోలు బసవపున్నయ్యకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. తొలుత పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేయగా, సభకు డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకు పైగా కమ్మ వసతిగృహం అధ్యక్షుడిగా కొనసాగారని అన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులేశారని అన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా జేకేసీ కళాశాల, ఆర్వోఆర్ ఇంజినీరింగ్ కళాశాల, హనుమయ్య ఫార్మసీ కళాశాల, మాదల శకుం తల భాస్కర్ నర్సింగ్ కళాశాలల స్థాపనతోపాటు కేఎల్పీ పబ్లిక్ స్కూల్ అధ్యక్షునిగా ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. ఆయన మాతృమూర్తి పేరుతో వృద్ధుల ఆశ్రమం స్థాపించి, ఇతోధికంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. సీనియర్ వైద్యులు యర్రా నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బసవపున్నయ్య ఆర్థిక రంగ నిపుణులుగా, విశ్లేషకుడిగా అనేక మందికి మార్గదర్శ కులుగా నిలిచారని అన్నారు. అధ్యక్షత వహించిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ బోలు బసవపున్నయ్య అని అన్నారు. పెద్ది సాంబశివరావు రాసిన వైద్య నిఘంటువుని డాక్టర్ అర్ధలపూడి సృజన్కుమార్ ఆవిష్కరించారు. అనంతరం శ్రావ్య, శాన్వి కర్రసాము నృత్య ప్రద ర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సేవ సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు, నిర్వహణ డాక్టర్ చిట్టినేని శివకోటేశ్వరావు, మోదుగల రవికృష్ణ, డాక్టర్ బసవపున్నయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి