సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
భక్తిశ్రద్ధలతో శంకరాచార్య, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు జరిగాయి. స్వామి వార్లకు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులతో దేవాలయ పాలకమండలి నిర్వహించింది. అన్నమయ్య కళావేదికపై సత్సంగ సభ్యులతో అష్టోత్తర శతనామావళిః పారాయణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టగా, తోట నరసింహారావు సౌజన్యంతో జొన్నా శివనాగేశ్వరరావు సుందరకాండ పారాయణం నిర్వ హించారు. వీరికి తబలపై ఎస్. వెంకట్, కీబోర్డుపై డి.రామకృష్ణ వాయిద్యాన్ని అందించారు.
![]() |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి