రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన అంకురారోపణతో ప్రారం భమై, 12న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల శ్రీవారి దివ్య శాంతి కల్యాణోత్సవం, 13న మేళతాళాలు, జానపద కళా రూపాలతో అపూర్వ రథోత్సవం, 14న చండీ హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన, శ్రీపద్మావతి అమ్మవారికి విశేష అభిషేకాలు, శ్రీపుష్పయాగం, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు జరుగు తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, స్వామిజీలు, పీఠాధిపతులు, అధికారులు హాజరవుతారని తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి