కళాకారిణికి పురస్కార ప్రదానం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వ ర్యంలో గోవిందరాజుల శారద స్మృతిగా సంగీత సభ శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎం. రమణప్రసాద్, ఆత్మీయ అతిథిగా కృష్ణ మైలవరపు (అమెరికా) పాల్గొ న్నారు. తొలుత నీరజా కిరణ్ మందపాటి కార్య క్రమాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. యువ కళాకారిణి చాగంటి రమ్యకిరణ్మయి(చెన్నై)కి యువ సంగీతరత్న బిరుదు పురస్కారమిచ్చి ఆలయ పాలకమండలి ఆధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య, పాలవర్గ సభ్యులు సత్కరించారు. అనంతరం రమ్యకిరణ్మయి శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ చేశారు. కార్యక్రమా లను సంస్థ ఆధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవ పెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కళాకా రులను అతిధులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి