ఘనంగా సంగీత కళానిలయం వార్షికోత్సవం
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై ఆదివారం రాత్రి శ్రీసాయి సంగీత కళానిలయం వార్షికోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీ.హెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమాల్లో సంస్థ వ్యవస్థాపకుడు తిన్నలూరి శ్రీహరిబాబు శిష్యులు దాదాపు వంద మంది తాము నేర్చుకున్న గాత్ర సంగీతం, తదితర అంశాలను ప్రదర్శించి పెద్దల మెప్పు పొందారు. సభలో ఎమ్మెల్సీ అలపాటి రాజేం ద్రప్రసాద్, తులసి గ్రూప్స్ చైర్మన్ తులసిరామచంద్రప్రభు, పారిశ్రామికవేత్త కనగాల సత్యనారాయణ, కొప్పురావూరి రమేష్ బాబు, డాక్టర్ అశోక్ ఆనంద్ కొప్పుల, నాట్యాచార్య ఎన్. బాలు మాట్లాడారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి