విశిష్ట మహిళలకు సత్కారం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావే దికపై శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుళ్లపల్లి సబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ తరఫున గుంటుపల్లి అరుణ కుమారి, సత్కార గ్రహీతలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. డెబ్బై ఏళ్లు పైబడి వివిధ రంగా లలో నిష్ణాతులైన ఎ.భారతీదేవి (వీణ, సంగీతం), డాక్టర్ జి.వైదేహి (విద్య, ఆధ్యాత్మిక రంగం), డాక్టర్ జంధ్యాల కనకదుర్గ (రచయిత్రి, విద్యారంగం), ఎం.రాజ్యలక్ష్మి (క్రీడా రంగం), పత్రి నిర్మల (సం గీతం)లను సత్కరించారు. అనంతరం డాక్టర్ జం ధ్యాల కనకదుర్గ రచించిన గత శతాబ్దపు సాహితీ స్రవంతి శతాబ్ది సూరీడు పుస్తకాన్ని ఆవిష్కరిం చారు. కార్యక్రమాన్ని పెద్ది సాంబశివరావు పర్యవేక్షించగా, కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత వహిం చారు. ప్రొఫెసర్ పరుచూరి విజయలక్ష్మి సభను నిర్వహించారు.చిన్నారి శ్యాన్వి నృత్య ప్రదర్శన అల రించింది.కార్యక్రమంలో గుళ్లపల్లి స్వాతి, గుళ్ళపల్లి రాఘవరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి