వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆష్టబం ధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాభిషేక మహోత్స వాలు ముగిశాయి. పద్మావతీ గోదాదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం నిర్వ హించారు. తితిదే ఆగమశాస్త్ర పండితుడు మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో విశేష హోమాలు, శిఖర కలశాలకు సామూహిక మహాకుంభాభిషేకం, హోమ పూర్ణాహుతి నిర్వ హించారు. భారీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్, మస్తానయ్య అధ్యక్షత వహించారు. విశ్వగురు పీఠాధిపతి విశ్వంజీ మహరాజ్, ఉత్తరకాశి శ్రీసూర్యభాస్కరేంద్ర సర స్వతీస్వామి అనుగ్రహ భాషణ చేశారు. డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, మాదల రత్నగిరిబాబు, కొర్రపాటి రామారావు పాల్గొన్నారు. బొల్లేపల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు, లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి