మహా సంప్రోక్షణ సమేత కుంభాభిషేకాలు
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయ శిఖరంపై కలశ స్థాపన చేశారు. స్వామి, గరుడల్వార్లకు మహాశాంతి అభిషేకం నిర్వహించారు. మూల విరాట్టులకు 1000 లీటర్ల పాలు, 500 లీటర్ల పెరుగు, 100 కొబ్బరిబొం డాలు, సుగంధద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కమలానంద భారతి స్వామి, పరమాత్మానందగిరి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. సాహితీవేత్తలు నిష్టల సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, యాబలూరి లోకనాథశర్మ మహాకుంభాభిషేక విశేషాలు వివరించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లా రావు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, బొర్రా ఉమామ హేశ్వరరావు, లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి