గరుడ వాహనంపై శ్రీవారి నగరోత్సవం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వ హిస్తున్న అష్టబంధన మహా సంప్రోక్షణ సమేత మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం కొన సాగాయి. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయదేవి సమేతుడైన స్వామి ఉత్సవ మూర్తులకు వైభవంగా నగరోత్సవాన్ని నిర్వహిం చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేషధా రణలు, గుర్రాలు, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగింపు కొనసాగింది. అనంతరం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో తపోవనం, శ్రీమాతా శివచైతన్య మాతాజీ (నులకపేట) పర్యవేక్ష ణలో చండీ హోమం, పూర్ణాహుతి, డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి నిర్వహణలో లలిత పారా యణ, సువాసిని సామూహిక కుంకుమార్చనలు జరి గాయి. అనంతరం సాహితీవేత్తలు ముప్పవరపు సిం హాచలశాస్త్రి, నారాయణం శేషుబాబు, మహా కుంభా భిషేక విశేషాలు, బ్రహ్మోత్సవాల విశిష్టతను భక్తు లకు వివరించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య. బీజేపీ నేతలు చెరుకూరి తిరు పతిరావు, యడ్లపాటి స్వరూపారాణి, పీవీ శంకర రావు (వికాస్ విద్యా సంస్థలు), ప్రముఖ వ్యాపార వేత్త మందలపు బంగారుబాబు ప్రసంగించారు. టీటీడీ ఆగమశాస్త్ర పండితులు మాల్యవంతం శ్రీని వాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసిం హాచార్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిం చారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీవేత్త నోరి నారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌ దరి, బండారు సాంబశివరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి