వైభవంగా హనుమ వాహన సేవ
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా మంగళవారం హనుమ వాహన నగరోత్సవం వైభవంగా జరిగింది. హనుమ వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఊరేగించారు. రాత్రి జరిగిన సభకు ఆలయ పాల కమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహించారు. ఉత్తరకాశీ సూర్యభాస్కరేంద్ర సరస్వతిస్వామి అనుగ్రహభాషణం చేశారు. కేవీ కోటేశ్వరరావు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, వ్యాపారవేత్తలు గోరంట్ల పున్నయ్య చౌదరి, కొర్రపాటి రామారావు తదితరులు ప్రసంగించారు. ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అతిథులను సత్కరిం చారు. కార్యక్రమాలను ఉపాధ్యక్షుడు సూర్య దేవర వెంకటేశ్వరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, ఎం.ఎస్. ప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి