వైభవంగా గజ వాహన సేవ
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్స వాలు కొనసాగుతున్నాయి. గజ వాహనంపై ఉభయదే. వేరులతో వేంకటేశ్వరస్వామి నగరోత్సవం సోమ వారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ పాల కమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమం డలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. వశిష్టాశ్రమ ఉత్తర పీఠాధిపతి, సర్వాధికార ప్రతినిధి కారంచేడు విశ్వంభరానంద గిరి స్వామి అనుగ్రహభాషణం చేశారు. 12 ఏళ్ల కోసారి చేసే మహాకుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం విశేష ఫలప్రదమ న్నారు. సభలో నారాయణం ప్రసాదాచార్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు విభాగ చైర్మన్ యేల్చూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ నిమ్మల శేషయ్య, వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, కిట్స్ విద్యాసంస్థల డైరెక్టర్ కోయి సుబ్బారావు, న్యాయవాది చిలుకూరి నరేంద్రబాబు తదితరులు ప్రసంగించారు. భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అతిథులను సత్కరించారు. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు ఆవుల అచ్యుతరామయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వర రావు, పుట్టగుంట ప్రభాకరరావు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి