మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాభి షేక మహోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చేశారు. తితిదే ఆగమపండి తులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహా చార్యుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, వేదస్వస్తి తదితర పూజాకార్యక్రమాలు జరి గాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. ఆష్టాక్షరీ పీఠ సంపత్కు మార రామానుజ జీయర్స్వామి, బ్రహ్మనిష్ఠా నంద సరస్వతీస్వామి, బృందావన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి కుంభాభిషేక విశిష్టతను వివరించారు. సభలో యలమంచిలి శివాజి, జూపూడి రంగరాజు, బొల్లేపల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు ప్రసం గించారు. కార్యక్రమాలను లంకా విజయబాబు, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్ట ప్రభాకరరావు, సూర్యదేవర వెంకటేశ్వరరావు తదితరులు పర్య వేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి