ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం
నాలుగు దశాబ్దాలుగా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు కృషి
ధర్మ ప్రచారం, ధార్మిక సేవలే లక్ష్యంగా సాగుతూ.. ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోంది. గుంటూరులోని భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.. పరిషత్తు ఆధ్వర్యంలో యజ్ఞ యాగాలే కాక భార తీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మల్లాంటి రామాయణ, మహాభారతాల్లాంటి ఇతిహాసాలు, మంత్ర శాస్త్ర గ్రంథాలు తదితరాలపై ప్రముఖ పండితులతో పరిశోధనాత్మక వ్యాసాలు రాయించి పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా భారతీయుల ఆదర్శ జీవన విధానం, దాని విలువలు నేటి తరానికి తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. భారతీ ధార్మిక పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు బౌల్లేపల్లి సత్యనారాయణ.
బొల్లేపల్లి సత్యనారాయణ 1995, ఫిబ్రవరి 5న శృంగేరీ పీఠాధిపతుల సూచనతో పరిషత్తును స్థాపించారు. భార్య లలితాంబ చేదోడువాదోడుగా సహస్ర చండీయాగాలు, లలితా, విష్ణు, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ లోక సంరక్షణ, అమరావతి రాజధానిగా వెలుగొందాలని, ఆంధ్ర ప్రాంతం సుభిక్షంగా నిలవాలన్న సంకల్పం ఉండడం విశేషం. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లోని వందల సంఖ్యలో పారా యణలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు.
పీఠాధిపతులు, ఆశ్రమాధిపతుల ప్రబోధాలు
పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి తొలుత అశోక్ నగర్‌లో ఆయన నివాసంలోని సువిశాల ప్రాంగణాన్ని ధార్మిక ప్రాంగణంగా మలచి ఎందరెందరో ప్రముఖ పీఠాధిపతులు, ఆశ్రమా దిపతులను ఆహ్వానించి వారితో ప్రబోధ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతర బృందావన్.. గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుబంధంగా ధార్మిక ప్రాంగణంలో యాగశాలను ప్రత్యేకంగా నిర్మింపజేసి అరుదైన యజ్ఞ, యాగాలు, హోమాలను వేదపండితులతో నిర్వహింపజేస్తున్నారు.
పుస్తక ప్రచురణలు.. అన్నదానం
భారతీయ సనాతన ధర్మానికి పట్టుగొమ్మ ల్లాంటి వాజ్ఞయాన్ని పరిశోధనాత్మక రీతిలో ప్రచురించడం మరో విశేషం, రామాయణ వైజ యంతి, మహాభారత వైజయంతి, చండీ సప్తశతి, గణపతి తత్వ వైభవం, ఆదిత్య వైభవం తదితర అంశాల్లో సుప్రసిద్ధ పండితులతో పరిశో ధనాత్మకంగా వ్యాసాలు రాయించి దాదాపు వందకు పైగా గ్రంథాలను ప్రచురించారు. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న ధార్మిక ప్రాంగణంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప, భవానీ తదితర దీక్షాపరు లకు ఏటా అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి