వైభవంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని వాల్మీకి మహర్షి రచించిన రామాయణ ప్రవచన నవాహ జ్ఞాన యజ్ఞం శుక్రవారం రాత్రి ముగిసింది. ఆచార్య శలాక రఘునాథశర్మ యుద్ధకాండలోని ఆధ్యాత్మిక, సాహిత్య, తత్వ విశేషాలను విశ్లేషించి చెప్పారు. ముప్పవరపు సింహాచల శాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షడు బొల్లేపల్లి సత్య నారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, లంకా విజయబాబు, పుట్టగుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు తదితరలు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత మండ అనంతకృష్ణ (తిరుపతి) వేణు గాన కచేరి జరిగింది. నిర్వాహకులు ఆచార్య రఘునాథశర్మను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి