శ్రీకృష్ణ జననం.. లీలా దివ్య వైభవం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త పీ.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ జయంతి సందర్భంగా భాగవత రస ప్రవచన ప్రసంగలహరి జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 'శ్రీకృష్ణ జననం' అనే అంశంపై వివరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్, మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కృష్ణుడు పుట్టిన వృత్తాంతం, చేసిన బాలక్రీడలు అన్నీ లీలామయమైన దివ్య వైభవాలు మాత్రమేనన్నారు. పుట్టుకే లేని పరమాత్మ పుట్టినట్లు కనిపించడం ఒక లీల అన్నారు. చేసిన ప్రతిచర్య మానవ జాతిని ధర్మమార్గంలో నడిపించటానికి కావలసిన ప్రబోధమే, తనలోనే సమస్త విశ్వము దాగియున్నదని తల్లికి తననోటిలో విశ్వరూపాన్ని చూపించిన సన్నివేశం ఇందుకు తార్కాణమన్నారు. కార్యక్రమాన్ని పి. రవికిషోర్, పి. హైమానంద పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి