అహంకారం వదిలితే పరమాత్మ అనుగ్రహం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ జయంతి సందర్భంగా భాగవత రస ప్రవచన ప్రసం గలహరి సాగుతోంది. గజేంద్రమోక్షంపై బుధవారం రాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహి తీవేత్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ప్రసంగిస్తూ గజేంద్ర మోక్షంలో ఏనుగు అంటే జీవుడని, జీవుడికి కర్మబం దాల్లో లభించే విడుదలే గజేంద్రమోక్షమన్నారు. జీవుడు అహం కారం వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయిస్తే ఆ అనుగ్రహం లభిస్తుందని, ఇదే గజేంద్రమోక్షం కథ సారాంశమని వివరించారు. కార్యక్రమాన్ని పి. రవికిశోర్. పి. హైమానంద పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి