భాగవత కావ్యాన్ని పఠించడం వల్ల ఆధ్యాత్మిక చింతన, ముక్తి లభిస్తుంది - ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి - 10.02.2025
నైతిక మార్గదర్శిని భాగవతం
మహాభాగవతం మానవాళికి నైతిక మార్గదర్శిని వంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై భాగవత రస వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచన మాలిక సోమవారం రాత్రి ప్రారంభమైంది. సుప్రసిద్ద సాహితీవేత్త పీఎస్సార్ ఆంజనేయప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రవచనాలు ఏర్పాటు చేశారు. తొలుత మంత్రాశ్రమ పీఠాధిపతి నరసింహానంద భారతీస్వామి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తా నయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృత పండితుడు, హిందూ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ డీ.ఎన్. దీక్షిత్. మాతృశ్రీ జిల్లెళ్లమూడి అమ్మ తనయుడు రవి అన్నయ్య తదితరులు పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సాహితీ సేద్యం, మహాభాగవత వైశిష్ట్యం గురించి ప్రసంగించారు. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి భాగవత రసవైభవంపై ప్రవచనం చేస్తూ భాగవత కావ్యాన్ని పఠించడం వల్ల ఆధ్యాత్మిక చింతన, ముక్తి లభిస్తుందన్నారు. కార్యక్ర మాన్ని పి. రవికిశోర్, పి. హైమానంద పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి