సందేశం పంచిన నాటికలు
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్న మయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి ఆధ్వర్యంలో 13వ నాట కోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రద ర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలి గించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిగా ఎల్ వీఆర్ క్రియేషన్స్ గుంటూరు వారు బత్తినేని సుభాష్ రచన, దర్శకత్వం వహించిన ‘విడాకులు’ హాస్యనాటిక ప్రదర్శించారు. అనంతరం హేలాపురి. కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారు చింతల మల్లేశ్వర రావు రచనకు, మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించిన సారీ.. రాంగ్ నెంబర్ నాటికను, కరణం సురేష్ మెమోరి యల్ థియేటర్స్ గుంటూరు వారు బొమ్మిడి రామకృష్ణ రచన, దర్శకత్వంలో తరమెల్లిపోతున్నదో నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ రామ కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ తదితరులు పర్యవేక్షించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి