స్ఫూర్తిప్రదాత.. డాక్టర్ కాసరనేని సదాశివరావు
డాక్టర్ కాసరనేని సదాశివరావు జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన స్ఫూర్తితోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నానని పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశి వరావు కళాసమితి ఆధ్వర్యంలో 13వ నాటకోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమారు డాక్టర్ కాసరనేని సదాశివరావు స్మారక ఆత్మీయ పురస్కారాన్ని డాక్టర్ యర్రా నాగేశ్వరరావు తదితరులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ యర్రా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, డాక్టర్ పాతూరి కిరణ్ చౌదరి, ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఘంటా పున్నారావు, పొన్నూరు కళాపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆకుల సాంబశివరావు, కళా సమితి సభ్యుడు యర్రా ఈశ్వరరావు, సం సంస్థ కన్వీనర్ రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై యర్రా నాగేశ్వరరావు పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. అనంతరం శ్రీసాయి కార్తిక్ క్రియేషన్స్, కాకినాడ వారు మార్కొండ దుర్గాప్రసాద్ రచనకు చట్రా విజ యలక్ష్మి మహేష్ దర్శకత్వం వహించిన దేవుడు కనిపించాడు' నాటికను ప్రదర్శించారు. తల్లి ప్రేమ ఆధారంగా ప్రదర్శితమైన నాటిక అందరినీ ఆకట్టుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి