మంచి సాహిత్యంతో సమాజానికి దిశానిర్దేశం
మంచి సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికపై రావి రంగారావు సాహిత్య పీఠం. ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జన రంజక కవి ప్రతిభా పురస్కార ప్రధాన సభ జరిగింది. సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కవులు కాలానికి కూడా దిశా నిర్దేశకులన్నారు. 11 ఏళ్లుగా జనానికి పనికొచ్చే కవుల్ని గుర్తించి పురస్కారాలిస్తున్న రావి రంగారావు సాహిత్య పీఠం కృషి ఎనలేనిదన్నారు. గ్రంథాలయ సెస్సును గ్రంథాలయాలకే వినియోగించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యావేత్త గద్దె మంగయ్య అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, యణ, పీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు, పోటీకి వచ్చిన వందకు పైగా కవిత్వ గ్రంథాల్లో ఎంపికైన నాలుగు పుస్తకాల కవులకు పురస్కారాలు అందించారు. ‘నాన్న ఎందుకో వెనక బడ్డాడు’ పుస్తక కవి ప్రకాశ్ నాయుడు, ‘అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి’ కవి లేదాళ్ల రాజేశ్వరరావు, ‘గాజా లేని జాగా’ కవి నేలపూరి రత్నాజీలను అతిథులు శాలువాలు, జ్ఞాపికలు రూ.2 వేలు నగదుతో సత్కరించారు. పుష్ప మంజరి పద్యాల సంపుటి రాసిన గుమ్మా నాగమంజరి పక్షాన రాజ్యలక్ష్మి పురస్కారం అందుకున్నారు. తొలుత దేవాలయ పాలక మండలి. అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఠం డైరెక్టరు డాక్టర్ రావి ఆరుణ, డాక్టర్ మైలవరపు లలితకుమారి, గడల శివప్రసాద్, కొల్లు నాగేంద్రం, పీఠం కన్వీనర్ నర్రా ప్రభావతి తదితరులు ప్రసంగించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి