నిరంతర సామాజిక సేవలో రోటరీ క్లబ్
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న రోటరీ క్లబ్బులు పోలియో నివారణ, విద్య, వైద్యం తదితర సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం పనిచేస్తుంటాయని రోటరీ క్లబ్స్ ఇంటర్నేషనల్ 3105 మాజీ గవర్నర్ అన్నే ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళా వేదిక మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో రోటరీ వోకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమం జరిగింది. చలనచిత్ర నటుడు జీవ (కొచ్చర్ల దయారత్నం), డాక్టర్ నూతలపాటి శ్రీనివాసరావు, చార్టెడ్ అకౌంటెంట్ పీవీ మల్లికార్జునరావు, పారిశ్రామికవేత్త దేసు సూర్యప్రకాశరావు, యుట్యూబర్ ఏలూరి నందినీలను నిర్వాహకులు సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు గాలి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సత్కార కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, రోటరీ జిల్లా మాజీ గవర్నర్ వడ్లమాని రవి, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు, కార్యదర్శి డాక్టర్ పొందూరి శివప్రసాద్, కోశా ధికారి టీవీ సీతారామయ్య, ఒకేషనల్ అవార్డుల డైరెక్టర్ వెలనాటి కోటేశ్వరరావు, ముప్పాళ్ల సుబ్బారావు, సీతా రమేష్, కె. శ్రీధరాబాబు, ఎల్ఎసీ ప్రసాద్, పీవీ సత్యనారా యణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి