ఆత్మవిజ్ఞానమే ఓంకార మహాయజ్ఞం
ఆత్మ విజ్ఞానమే ఓంకార మహాయజ్ఞమని ప్రణవఆశ్రమం, కాకినాడ వ్యవస్థాపకులు సుమిత్రానంద సరస్వతీ మాతాజీ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ఓంకార మహాయజ్ఞం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన సంస్కృతి సంప్రదాయాలను పక్కన పెట్టినప్పుడే మన విలువలు పడిపోతున్నాయన్నారు. భవిషత్ తరానికి మనమే మందిస్తామనే విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలన్నారు. ఆలయం సందర్శించినప్పుడు పాదరక్షలు బయట వదులుతాం కాని సెల్‌ఫోన్లు మాత్రం ఎటువంటి పరిస్థితులలో వదలటలేదన్నారు. ఎన్నోజన్మల పుణ్యమే మానవ జన్మ పొందటమని అందులోను అత్యంత పుణ్యఫలం భారతదేశంలో జన్మించటమన్నారు. కార్యక్రమాన్ని కొమ్మినేని లక్ష్మీ అపర్ణ తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి