రథసప్తమి వేడుకలు.. ప్రముఖులకు సన్మానం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పరిషత్ 31వ వార్షికోత్సవం, రధస ప్తమి వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. సూర్యభగవానుని మూల విరాట్కు అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ, విశేష పొంగలి నివేదన నిర్వహించారు. అరుణ పారాయణం, రుద్రహోమం, సామూహిక ఆదిత్య హృదయం, విష్ణుసహస్ర నామ పారాయణాలు చేశారు. కల్యాణ వైభవం కార్యక్రమానికి సాహితీవేత్త డాక్టర్ కేవీ శ్రీరంగనాయకి అధ్యక్షత వహించారు. సభలో సాహితీవేత్తలు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి. సీతాకల్యాణం, డాక్టర్ వేమూరి సత్యవతి.. రుక్మిణీ కల్యాణం, డాక్టర్ ఇందిరాపద్మావతి.. కల్యాణం అంశాలపై ఆధ్యా త్మిక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్య క్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్, మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు. లంకా విజయబాబు, ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 90 ఏళ్లు దాటిన ప్రముఖులు పతకమూరి నాగేశ్వరరావు, ఉప్పాల రత్తయ్య, చిరుమామిళ్ల కృష్ణారావులను నిర్వాహకులు సన్మానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి