ప్రేమ శిఖరం పద్య నాటకం పుస్తకావిష్కరణ
వ్యక్తి ప్రేమ కంటే విశ్వ ప్రేమ గొప్పదని ప్రేమ శిఖరం నాటకం చాటిచె బుతుందని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ చిల్లర భవా నీదేవి అన్నారు. డాక్టర్ వీవీఎల్ నర సింహం రచించిన ఆనంద భిక్షువు పద్య కావ్యానికి అనుగుణంగా డాక్టర్ చిటిప్రోలు వెంకటరత్నం రచించిన ప్రేమశిఖరం పద్యనాటకం పుస్తకాన్ని ఢమరుకం లలిత కళా సమితి ఆధ్వ ర్యంలో ఆవిష్కరించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న మయ్య కళావేదికపై సోమవారం రాత్రి జరిగిన సభకు విశ్రాంత చిత్రకళా ఉపాధ్యాయుడు గన్నే వాసుదేవరావు అధ్యక్షత వహించారు. భవానీదేవి గ్రంథావిష్కరణ చేసి మాట్లాడుతూ ప్రేమశిఖరం అందరూ చదవతగ్గదన్నారు. తొలి ప్రతిని ఆమె వెంకటరత్నం, జయప్రద దంపతులకు అందించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి పుస్తక సమీక్ష చేశారు. ఇదే వేది కపై గన్నె శాన్వితకు నాట్య మంజీర బిరుదు. చిత్రకళలో నైపుణ్యాలను ప్రదర్శించిన 20 మంది చిన్నారులకు యువ చిత్రరత్న పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వీఎన్ విద్యాసాగర్, చేగొండి సత్యనారాయణ మూర్తి, డమరుకం లలిత కళా సమితి వ్యవస్థాప కుడు వి.మల్లికార్జునాచారి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి