ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వైభవంగా వీణాఝరి - 02.02.2025

వైభవంగా వీణాఝరి 

బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం  రాత్రి వీణామరి కార్యక్రమం వైభవంగా జరిగింది. రామరాజు పౌండేషన్, రామరాజు ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్వహణలో సంస్థ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాస్ దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం కళాని పంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆర్.లక్ష్మి శ్రీనివాస్ వీణ కచేరీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎ. భారతీదేవి, బి. వంశీకృష్ణ, అయ్యగారి సత్యప్రసాద్, కె. శశిధర్, కె. హేమలక్ష్మి, ఎస్వీఎస్ కేఎస్ గోవిందరాజన్, బి. మధురిమ వీణ కచేరీలు చేశారు. ప్రధాన కచేరీలో భాగంగా ప్రముఖ వీణ విద్వాంసుడు సుడు వడలి ఫణినారాయణ వీణ కచేరీ చేశారు. వడలి ఫణి నారాయణకు పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కారాన్ని రామరాజు శ్రీనివాస్ దంపతులు, ముఖ్యఅతిథిగా పొల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, డాక్టర్ భూసురపల్లి వెంక టేశ్వర్లు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యలు ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం వీణాఝరిలో పాల్గొన్న వీణా విద్వాంసులు, వాద్య కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.








కామెంట్‌లు