సాయిరాగ సంగీత కళాశాల నాలుగో వార్షికోత్సవం
బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం శ్రీ సాయి రాగ సంగీత కళాశాల 4వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఉప కార్యదర్శి రావినూతల వెంకటేశ్వర్లు, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ కందిమళ్ల శ్రీనివాసరావు, దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య ముఖ్య అతి థులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనం తరం కళాశాల ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి తన శిష్యులతో అన్నమయ్య కీర్తనలు ఆలపించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా అతి థులు పిల్లలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు సమరి ్పంచారు. ప్రముఖ రంగస్థల నటుడు, నంది అవార్డు గ్రహీత బసవరాజు జయ శంకర్ను సన్మానించారు. అనంతరం కళాశాలలో సంగీతం నేర్చుకునే పిల్లలు తమ గురువును ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి