ప్రముఖులకు ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారం
స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె.ఆర్.కె. ఈవెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ నాటకోత్సవాల సందర్భంగా శనివారం ప్రముఖులకు ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కార సభ జరిగింది. సభకు పరిషత్ కన్వీనర్ రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు.అతిథిలుగా విద్యాసంస్థల డైరెక్టర్ పీవీ శంకర్రావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంస్థ సభ్యులు వేములపల్లి విఠల్, బొప్పన నరసింహారావు (బుజ్జి), జి. మల్లికార్జునరావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ వైస్ చైర్మన్ కాట్రగడ్డ ప్రసాదు, కన్వీనర్ అట్లూరి నారాయణరావు లను ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం సహృదయ ద్రోణాదుల వారు అద్దేపల్లి భరత్ కుమార్ రచనకు, డి.మహేంద్ర దర్శకత్వం వహించిన వర్క్ ఫ్రం హోం నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి