ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె. ఆర్ కె.ఈవెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ నాటకోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ అధ్యక్షత వహించారు. అతిథిలుగా ఎన్.ఆర్.ఐ. విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిడి తిలక్ బాబు, సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు, తెనాలి ఏ.ఎస్.ఎన్.డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కొలసాని రామ్‌చంద్, సంస్థ కన్వినర్ రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు (బుజ్జి), జి. మల్లికార్జునరావు తదితరులు పాల్గొని వివిఐటి విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్‌కు ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం తెలుగు కళా సమితి విశాఖపట్నం వారు పి.టి. మాధవన్ రచనకు, చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటిక, అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు స్నిగ్ధ రచనకు ఎన్. రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించిన ఇంద్రప్రస్థం నాటికలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి