అలరించిన కర్ణాటక గాత్ర సంగీత కచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల వారి నెలవారి కార్యక్రమంలో భాగంగా కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పాఠశాల నిర్వాహకులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమారి లంకా తేజస్విని, విజయవాడ తమ గాత్రధారణలో తొలుత హంసద్వని రాగం, ఆదితాళంలో వాతాపి గణపతిం భజే తో ప్రారంభించి పలు వాగ్గేయకారుల కీర్తనలు ఆలపించిన కర్ణాటక గాత్ర కచేరి ఆహ్లాదకరంగా సాగింది. వయోలిన్‌పై కుమారి ఎ. కామాక్షి, హైదరాబాద్, మృదంగంపై చి. కె. అరవింద్, చెన్నై చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి