ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ భాస్కర డ్యాన్స్ అకాడమి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కూచిపూడి నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షుల సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాట్యాచారిణి డి. సాత్విక శిష్య బృందం లక్ష్మి ప్రనతి, హెూష్నవి, శరణ్య, తను శ్రీ, ఆరాధ్య, జాహ్నవి, మనస్విని, హాసిని, అక్షిత, సహస్ర, ప్రజ్ఞ, ధరనిత, మోక్ష లు గణపతి తాళం, వారాహి, అల్లో నేరెల్లో, అష్టలక్ష్మి, గరుడ గమన, తిరు తిరు జవరాల, పాట్ డాన్స్, మహా గణపతి, తెలుగు భాష విజయం, దశావతారం సంకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను అలరింపజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి