వైభవంగా మకరజ్యోతి దర్శనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మకరజ్యోతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అతిథులుగా పాల్గొన్న విశ్వయోగి విశ్వంజి మహారాజ్, బ్రహ్మ జ్ఞానానంద సరస్వతీ స్వామి లు కర్పూర మకర జ్యోతిని వెలిగించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్య కళావేదికపై అయ్యప్పస్వామి ఉత్సవమూర్తికి అభిషేకాలు, అర్చనలు, అలంకరణ నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అధికసంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి