మహతీ స్వరసుధ రజతోత్సవాలు
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతి స్వరసుధ రజతోత్సవాలు వైభవంగా జరిగాయి. సంస్థ అధ్యక్షురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో గాయకులు పాత తెలుగు చలనచిత్రాల్లోని భక్తి పాటలను గానం చేశారు. కీబోర్డ్ కె. రవిబాబు, తబలపై ఎస్.వెంకట్, ప్యాడ్స్‌పై వి.ప్రసాద్ వాద్య సహకారం అందించారు. డాక్టర్ నరసింహారావు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కోటా సాంబశివరావు. పట్టస్వామి గోపాలకృష్ణమూర్తి, కొడాలి వీరభద్రరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కె. మదన్మోహన్ పర్యవేక్షించారు. వ్యాఖ్యాతగా బి. కృష్ణ ప్రసాద్ వ్యవహరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి