హనుమాన్ చాలీసా అష్టోత్తర పారాయణం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని శ్రీపద్మావతి కల్యాణ మండపంలో భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవ స్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంప తులు, ఆలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో సర్వ కార్య జయ సంకల్పంతో మంగళవారం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేశారు. కార్యక్రమాలను శ్రీహరి పర్యవేక్షించారు. చిలకలూరిపేట ఈవూరిపాలెం భజన బృందం హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సందర్భంగా బృందావన శ్రీనివాసునికి 108 సువర్ణ అష్టదళ పద్మాలతో పూజను ప్రధాన పూజారి మాధవాచారి బృందం నిర్వహించింది. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సూర్యదేవర వెంకటేశ్వర్లు, పుట్టా ప్రభాకర్ తదితర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి