ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీహోమం - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ - 18.11.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యాంజలి – 06.01.2025

ఆకట్టుకున్న నృత్యాంజలి – 06.01.2025

స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, కథక్ కళాక్షేత్ర, కళ పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన కళాకదంబం వీక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభకు కళ పత్రిక సంపాదకుడు డాక్టర్ మొహమ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు. కేసీపీ లిమిటెడ్ వైస్ చైర్మన్ డాక్టర్ వజ్జా మధుసూదనరావు, రామరాజు పౌండేషన్ అధ్యక్షడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మెన్ బాబు మిరియం, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్, మస్తానయ్య, తెనాలి బ్రేక్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అంజుబాబు, గురు బనీత నాగ్ శిష్యబృందం ప్రదర్శించిన కథక్ నృత్యం, గురు సుస్మిత మిశ్రా బృందం ఒడిస్సీ, తరంగిణి మ్యూజిక్, డాన్స్ అకాడమీ నిర్వాహకు రాలు పదజావిశ్వాస్ కూచిపూడి నృత్యం, బిజినా సురేంద్ర నాథ్ బృందం మోహినీ అట్టం ప్రదర్శనలు ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో కథక్ కళాక్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ కథక్ అంజిబాబు, కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసిం హారావు, జీవీజీ శంకర్, డి.తిరుమలేశ్వరరావు, జి. మల్లి కార్జునరావు తదితరలు పాల్గొన్నారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.