వైభవంగా సామూహిక కుంకుమార్చనలు
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ సౌజన్యంతో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గురువారం సామూహిక కుంకుమార్చన జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావై 18వ పాశురం ప్రవచిస్తూ నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను గోపికలు తెరువకపోవుటచేత అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా అని గోదాదేవిని ప్రార్ధించారని పాశురంలోని విశేష అంశాలను విశ్లేషించి చెప్పి దానికి అనుబంధంగా సామూహిక కుంకుమార్చనలు చేయించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి